14 రోజుల్లోనే పాక్ ఆటగాడి రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా నయా సెన్సెషన్..
4 August 2023
Pic credit - Instagram
వెస్టిండీస్ పర్యటనలో ముఖేష్ కుమార్ అద్భుతాలు చేశాడు.
తన బలమైన ప్రదర్శన కారణంగా, ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేచేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో పాక్ ఆటగాడి రికార్డును బద్దలు కొట్టాడు.
అతి తక్కువ సమయంలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ప్రపంచంలో రెండో ఆటగాడిగా ముఖేష్ నిలిచాడు.
కేవలం 14 రోజుల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు.
15 రోజుల్లోనే అరంగేట్రం చేసిన పాకిస్థాన్ ఆటగాడు ఎజాజ్ చీమాను రికార్డును బ్రేక్ చేశాడు.
టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో 14 రోజుల్లోనే అరంగేట్రం చేశాడు.
జులై 20న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్‌లో ముఖేష్ రెడ్ బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
అరంగేట్రం టెస్టులోనే 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. 3 మ్యాచ్‌ల్లో మొత్తం 4 వికెట్లు తీశాడు.
చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ముఖేష్.
ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర కంటే 27 రెట్లు ఎక్కువ చెల్లించి రూ.5.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..