ప్రపంచ కప్ టిక్కెట్లు ఎలా పొందాలి? పూర్తి ప్రక్రియ మీకోసం..

16 August 2023

Pic credit - Instagram

అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. చాలా మంది అభిమానులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారు.

ఆగస్ట్ 25 నుంచి టిక్కెట్ల సేల్

టికెట్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్టు 25 నుంచి వన్డే ప్రపంచకప్ టిక్కెట్ల విక్రయం ప్రారంభం కానుంది.

ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి

టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అభిమానులు cricketworldcup.com/registerలో నమోదు చేసుకోవాలి. అలాగే బుక్‌మై షో నుంచి కూడా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

ఐసీసీ ఏం చెప్పిందంటే

టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, అభిమానులు ముందుగా ఐసీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అందులో పేరు, చిరునామా, దేశం తెలియజేయాల్సి ఉంటుంది. 

ఐదు దశల్లో టిక్కట్ల విక్రయం

భారత మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం ఐదు దశల్లో జరుగుతుంది. అలాగే టీమ్ ఇండియా టిక్కెట్ల విక్రయం కూడా ఆగస్టు 25 తర్వాత ప్రారంభమవుతుందని ఐసిసి తెలిపింది.

ఆగస్ట్ 30 నుంచి 

ఆగస్ట్ 30 నుంచి భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 

మెయిన్ మ్యాచ్‌లకు ఎప్పుడంటే

అదే సమయంలో ప్రదాన మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున చెన్నై, పుణె, ఢిల్లీలో విక్రయాలు జరగనున్నాయి. 

సెప్టెంబర్ 1 నుంచి షురూ

సెప్టెంబర్ 1 నుంచి ధర్మశాల, లక్నో, ముంబయిలో జరిగే మ్యాచ్‌ల విక్రయం ప్రారంభం కాగా, బెంగళూరు, కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లు ఒకరోజు తర్వాత విక్రయించనున్నారు.

భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు ఎప్పుడంటే

ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది.