కోహ్లీ, బాబర్.. ఆసియా కప్‌లో అత్యంత తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఎవరు?

26 August 2023

Pic credit - Instagram

ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. చివరిసారిగా 2018లో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌ జరిగింది.

కౌంట్ డౌన్ షురూ..

ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, బాబర్ ఆజంల బ్యాటింగ్‌ను ఆసియా కప్‌లో అందరూ చూడబోతున్నారు. అయితే ఆసియా కప్‌లో అత్యంత తుఫాను బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?

ఫాంలో విరాట్, బాబర్..

కోహ్లీ లేదా బాబర్ కానే కాదు. శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య వన్డే ఆసియా కప్‌లో అత్యంత తుఫాను బ్యాట్స్‌మెన్. 1990, 2008 మధ్య, అతను 25 మ్యాచ్‌లలో 102.52 స్ట్రైక్ రేట్‌తో 1220 పరుగులు చేశాడు.

తుఫాన్ ప్లేయర్ ఎవరు..

2004-2012 మధ్యకాలంలో 100.55 స్ట్రైక్ రేట్‌తో 14 మ్యాచ్‌ల్లో 546 పరుగులు చేసిన జయసూర్య తర్వాత పాకిస్థాన్ ఆటగాడు యూనస్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 

జయసూర్య తర్వాత..

ఉమర్ అక్మల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈయన స్ట్రైక్ రేట్ 99.41లుగా నిలిచింది.

మూడో స్థానంలోనూ పాక్ ప్లేయరే..

కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 97.14 స్ట్రైక్ రేట్‌తో 613 పరుగులు చేశాడు. అతను ప్రస్తుత కాలంలో అత్యంత తుఫాను బ్యాట్స్‌మన్. 

నాలుగో స్థానంలో కోహ్లీ..

వీరితో పాటు, ఆసియా కప్ 2023లో పాల్గొనే ఏ జట్టు నుంచి మరే ఇతర బ్యాట్స్‌మెన్ టాప్ 10లో లేరు.

మరో బ్యాటర్ లేడు..

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 23వ స్థానంలో ఉన్నాడు. అతను 2018 ఆసియా కప్‌లో 70.90 స్ట్రైక్ రేట్‌తో 5 మ్యాచ్‌ల్లో 156 పరుగులు చేశాడు.

23వ స్థానంలో బాబర్..