TV9 Telugu
5 November 2024
IPL 2025 వేలానికి ముందు RCB విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్‌లను ఉంచుకుంది. ఇప్పటికే రూ. 37 కోట్లు ఖర్చు చేసిన ఆర్‌సీబీ రూ. 83కోట్లతో వేలంలోకి అడుగుపెట్టనుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్‌సీబీ టార్గెట్ చేయగల ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. వారెవరో ఓసారి చూద్దాం..
మహ్మద్ సిరాజ్ పేరు ఇందులో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 93 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
విల్ జాక్స్ పేరు రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్లేయర్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 230 పరుగులతోపాటు 2 వికెట్లు పడగట్టాడు. ఇది కేవలం 8 మ్యాచ్‌ల్లోనే సాధించడం గమనార్హం.
అనుజ్ రావత్ పేరు కూడా ఆర్‌సీబీ లిస్ట్‌లో చేరింది. ఈ ఆటగాడు 5 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 127.27 స్ట్రైక్ రేట్‌తో 98 పరుగులు చేశాడు. ఫ్యూచర్ టీంలో భాగంగా ఈ ప్లేయర్‌పై ఆర్‌సీబీ పందేం వేయనుంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పైనే ఆర్‌సీబీ కన్నేసింది. ఈ డేంజరస్ ప్లేయర్ ఇప్పటి వరకు ఆడిన 134 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 156.73 స్ట్రైక్ రేట్‌తో 134 పరుగులు చేశాడు.
అశుతోష్ శర్మ కూడా ఆర్‌సీబీ లిస్ట్‌లో చేరాడు. ఇప్పటి వరకు 11 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 167.26 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు.
భువనేశ్వర్ కుమార్ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 176 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 181 వికెట్లు పడగొట్టాడు.