20 June, 2025
Venkatachari
వన్డే ఫార్మాట్‌లో అత్యధికంగా డకౌట్స్ అయిన ప్లేయర్ల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ లిస్టులో ఆటగాళ్లు ఎక్కువగా బౌలర్లు ఉన్నారు.
వన్డేల్లో అత్యధికంగా డకౌట్స్ అయిన ప్లేయర్లలో శ్రీలంకకు చెందిన 4గురు ప్లేయర్లు టాప్ 6లో ఉండిపోయారు.
ఇక ఈ టాప్ 6లో ఇద్దరు ప్లేయర్లు పాకిస్తాన్ నుంచి చోటు దక్కించుకున్నారు.
శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య వన్డేల్లో 34 సార్లు డకౌట్స్ అయ్యాడు.
పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్‌లో దూకుడుగా ఆడాడు. కానీ, తన వన్డే కెరీర్‌లో 30 సందర్భాలలో సున్నాకే ఔటయ్యాడు.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ వన్డేల్లో 28 సార్లు డకౌట్ అయ్యాడు. బంతితో డేంజరస్‌గా మారినా.. బ్యాట్‌తో పెద్దగా అద్భుతాలు చేయలేకపోయాడు.
శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే 12,000 వన్డే పరుగులకు పైగా సాధించాడు. కానీ, తన వన్డే కెరీర్‌లో 28 సార్లు సున్నా వద్దే ఔటయ్యాడు.
లసిత్ మలింగ శ్రీలంకకు చెందిన ప్రాణాంతక బౌలర్. కానీ, బ్యాటింగ్ విషయంలో అతనికి అంత గొప్ప ప్రదర్శన లేదు. తన వన్డే కెరీర్‌లో 26 సార్లు డకౌట్ అయ్యాడు.
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన వన్డే కెరీర్‌లో 534 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతని వన్డే బ్యాటింగ్ రికార్డులో 25 డకౌట్‌లు ఉన్నాయి.