మెగా వేలంలోకి ఊహించని పేర్లు.. లిస్టులో స్టార్ క్రికెటర్లు

Ravi Kiran

15 Aug 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

రిటైన్‌లు, RTMలు కలుపుకుని సుమారు 6 నుంచి 7 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే అవకాశాన్ని కల్పించింది బోర్డు.

మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖరారైంది. మరి ఏ ఫ్రాంచైజీ ఏయే ఆటగాళ్లను రిటైన్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్‌లను రిటైన్ చేసే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మతిషా పతిరనలను జట్టులో ఉంచుకోవచ్చు.

ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మలను కొనసాగించవచ్చు.

గుజరాత్ టైటాన్స్; మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్‌లను రిటైన్ చేసుకోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్: కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌లను జట్టులో ఉంచుకునే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌: మార్కస్‌ స్టోయినిస్‌, కేఎల్‌ రాహుల్‌, నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ యాదవ్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్: అశుతోష్ శర్మ, సామ్ కరణ్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్‌లను కొనసాగించవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్‌లను కొనసాగించవచ్చు.