Ravi Kiran
08 June 2024
ఎప్పుడూ ఏదో ఒక మ్యాచ్‌తో బిజీగా ఉండే క్రికెట్ స్టార్లు వీలు చిక్కినప్పుడల్లా తమకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబంతో కలిసి ఆటవిడుపు కోసం వెళ్తుంటారు. అయితే వారికి ఇష్టమైన ప్రదేశాలు ఏంటి? ఎవరు ఎక్కడికి వెళ్తుంటారో తెలుసుకుందామా?
క్రికెట్ గాడ్‌గా చెప్పుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెకేషన్ కోసం ఎక్కువగా ముస్సోరీకి వెళ్లడానికి ఇష్టపడతారు.
మన మిస్టర్ కూల్ ధోనీకి సిమ్లా అంటే ఇష్టం. అందుకే ఆయన తన కుటుంబంతో కలిసి సిమ్లాకు వెళ్తుంటారు.
ఇక మన రన్‌మెషీన్ విరాట్ కోహ్లీకి చిన్నప్పటి నుంచి మనాలి అంటే ఇష్టం. అందుకే ఆయన తన కుటుంబంతో ఎక్కువగా మనాలికి వెళ్తుంటారు.
మన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు కూడా ధర్మశాల అంటే చాలా ఇష్టం. తరచూ ఫ్యామిలీతో ధర్మశాలను సందర్శిస్తుంటారు. అది ఆయనకు సొంత ఇల్లులా అనిపిస్తుందట.
ఇక మన మరో క్రికెటర్ కే.ఎల్. రాహుల్ ఎక్కువగా లండన్ వెళ్లడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడూ తన భార్య అతియా శెట్టితో కలిసి హాలిడేకి లండన్ వెళ్తుంటాడు కెఎల్ రాహుల్.
ఇక ఇంగ్లండ్ క్రికెటర్ బెయిర్ స్టోకి ధర్మశాల ఎంతో ఇష్టమైన ప్రదేశం. తొలిసారి ధర్మశాలను సందర్శించిన ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్‌కి కూడా ధర్మశాల అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా ఆయన ధర్మశాలను సందర్శిస్తుంటారు.
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్‌స్టోక్స్‌కి కూడా ధర్మశాల అంటే చాలా ఇష్టం. తరచూ ధర్మశాలను సందర్శిస్తూ అక్కడి అందాలు మైమరచిపోతారు.