కార్గిల్‌లో తండ్రి.. లంకలో కొడుకు.. పాక్‌ను చితక్కొట్టారుగా..
కార్గిల్‌లో తండ్రి పాకిస్తాన్‌ను ఓడించాడు.. ఇప్పుడు కొడుకు క్రికెట్లో పాక్‌పై దుమ్ము రేపాడు.
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో భారత్ ఏ టీం పాకిస్తాన్ ఏని 8 వికెట్ల తేడాతో ఓడించింది.
భారత విజయానికి స్టార్ యువ ఫాస్ట్ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్ హీరోగా నిలిచాడు. 5 వికెట్లు పడగొట్టాడు.
రాజవర్ధన్ తర్వాత 104 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో సాయి సుదర్శన్ జట్టును గెలిపించాడు.
వీరిద్దరితో పాటు తన కీపింగ్‌తో విజయానికి సహకరించిన ధ్రువ్ జురైల్ అద్భుతం కూడా ఈ మ్యాచ్‌లో కనిపించింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన 4గురిని ఔట్ చేయడంలో జురైల్ సహకరించాడు.
ఇందులో 3 క్యాచ్‌లు తీసి ఒక స్టంప్ ఔట్ చేశాడు.
జురైల్‌కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
నేపాల్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు.
ఇంతకు ముందు కూడా పాకిస్థాన్‌ను ఓడించడంలో జురైల్ కుటుంబం సహకరించింది.
ధృవ్ తండ్రి 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీలో భాగంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2023 నుంచి ఫినిషింగ్‌తో తనకంటూ ధ్రువ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ధ్రువ్ ఇప్పుడు టీమిండియా బ్లూ జెర్సీలోనూ పేరు తెచ్చుకుంటున్నాడు.
ఇక్కడ క్లిక్ చేయండి