TV9 Telugu
28th April 2025
ఐపీఎల్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఓ తప్పుడు నిర్ణయం మొత్తం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
అందువల్ల, మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడంలో అంపైర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు.
కానీ మైదానంలోని అంపైర్ నుంచి ఫోర్త్ అంపైర్ వరకు ఒక మ్యాచ్ నుంచి ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా?
అయితే ఫొర్త్ అంపైర్ ప్రతి మ్యాచ్‌లో దాదాపు రూ. 2 లక్షల ఫీజు సంపాదిస్తున్నాడు.
ఐసీసీ ప్యానెల్‌లోని ఎలైట్ అంపైర్లు ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.3.7 లక్షలు వసూలు చేస్తున్నారు.
డెవలప్‌మెంటల్ అంపైర్లకు ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ.60,000 ఫీజు చెల్లిస్తున్నారు.
ప్లేఆఫ్‌లు, ఫైనల్‌లో అంపైరింగ్ చేసినందుకు ఎలైట్ అంపైర్లకు రూ. 8.2 లక్షల బోనస్ కూడా లభిస్తుంది.