TV9 Telugu
6 December 2024
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.
పెర్త్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
అడిలైడ్ టెస్ట్ డే-నైట్ ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇందు కోసం పింక్ బాల్ ఉపయోగిస్తున్నారు.
పింక్ బాల్ అనేది డే-నైట్ టెస్ట్‌లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. సాధారణంగా టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతికి ఇది చాలా రకాలుగా భిన్నంగా ఉంటుంది.
గులాబీ బంతిపై పెయింట్ అనేక అదనపు పొరలను కలిగి ఉంటుంది. అంటే, రెడ్ బాల్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ లేయర్‌లు ఉంటాయి.
పింక్ బాల్ సీమ్ రెడ్ బాల్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. మెరుపు 40 ఓవర్ల వరకు ఉంటుంది. అందువల్ల, బౌలర్లు ప్రయోజనాన్ని పొందుతారు.
పింక్ బాల్ ఎరుపు, నారింజ, పసుపు లేదా ఇతర రంగుల కంటే సాయంత్రంతోపాటు రాత్రి చూడటం సులభం.
అడిలైడ్ టెస్టులో కూకబుర్ర కంపెనీకి చెందిన పింక్ బాల్‌ను ఉపయోగించనున్నారు. దీని ధర రూ.20-25 వేలు ఉంటుంది.