వన్డే ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే..

6th NOV 2023

Pic credit - Instagram

ఐదోసారి ఛాంపియన్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు.. 2015 ప్రపంచకప్ లో మైకేల్ క్లార్క్ సారథ్యంలో వరుసగా ఆరు విజయాలను నమోదు చేసింది.

2015 ప్రపంచకప్

మార్టిన్ క్రో నేతృత్వంలోని న్యూజిలాండ్ 1992 ప్రపంచ కప్‌లో వరుసగా 7 మ్యాచ్‌లు గెలుచుకుంది.

1992 ప్రపంచ కప్‌లో

సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ 2003 ప్రపంచకప్‌లో వరుసగా 8 విజయాలను నమోదు చేసింది.  అయితే ఫైనల్‌లో ఆసీస్‌పై తడబడింది.

2003 ప్రపంచకప్‌లో 

బ్రెండన్ మెకల్లమ్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ 2015 ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది.

2015 ప్రపంచకప్‌లో

2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ వరుసగా 8 విజయాలు సాధించింది.

2023 ప్రపంచకప్‌లో

2011, 2015 ప్రపంచకప్‌లలో ఎంఎస్ ధోని నేతృత్వంలోని భారత్ మొత్తం 11 మ్యాచ్‌లను గెలుచుకుంది.

2011, 2015 ప్రపంచకప్‌లలో

2011 ఎడిషన్‌లో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.  ఆ తర్వాత 2015 ప్రపంచకప్‌లో ఏడు వరుస విజయాలు సాధించింది.

2011 ఎడిషన్‌లో

2003, 2007, 2011 ఎడిషన్లలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా రికీ పాంటింగ్ వరుసగా 24 ప్రపంచ కప్ మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కలిగి ఉన్నాడు.

2003, 2007, 2011 ఎడిషన్లలో