ఫ్యామిలీ తోడుంటేనే పని జరిగేది.. దూరం చేస్తే, షాక్ తప్పదు: జోస్ బట్లర్
TV9 Telugu
21 January 2025
Jos Buttler: ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. క్రికెట్ సిరీస్ సమయంలో కుటుంబంతో కలిసి ఉండటం ఆటపై ప్రభావం చూపదని అన్నాడు.
సుదీర్ఘ పర్యటనలలో తనను తాను ఉత్సాహంగా, రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యుల మద్దతు అవసరమని ఆయన అన్నాడు.
కోవిడ్ తర్వాత, మన ప్రియమైన వారిని కలిసి ఉంచడం, వారితో ఉండటం మరింత ముఖ్యమైనది అంటూ బీసీసీఐ కొత్త రూల్స్‌పై వ్యంగ్యంగా మాట్లాడాడు.
భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు బట్లర్ ఈ ప్రకటన చేశాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌లను కోల్పోయిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ పరిమితిని విధించింది.
ఈ నిర్ణయం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సంతోషం వ్యక్తం చేయడం లేదు. మిగతా ఆటగాళ్ల నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తోంది.
బట్లర్ మాట్లాడుతూ, 'ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇలాంటి సమయాల్లో కుటుంబం కూడా కలిసి ఉండాలి' అంటూ చెప్పుకొచ్చాడు.
'ఒక ఆటగాడిగా, క్రికెట్ మైదానంలో చాలా సమయం పెట్టుబడి పెడతారు. ఆటగాళ్ళు చాలా కాలం పాటు తమ ఇళ్లకు దూరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి ఉండటం క్రీడలపై చెడు ప్రభావం చూపదుంటూ' తెలిపాడు.
చాలా కాలం పాటు ఇతర దేశాల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లకు మానసిక క్షోభ కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫలితాలు మనకు అనుకూలంగా లేనప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం చాలా ముఖ్యం.