మరోసారి నిరాశే.. ఏడాది కాలంగా రీఎంట్రీకి ఎదురుచూపులు..

12 August 2023

Pic credit - Instagram

సిరీస్‌లో నాలుగో టీ20 మ్యాచ్ భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

నాలుగో టీ20..

భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, 'మేం కూడా మొదట బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం, టీంలో పెద్దగా మార్పులేదు. ఆటగాళ్లు చాలా బాగా రాణిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. 

అదే టీంతో బరిలోకి..

'చివరి మ్యాచ్‌లో అందరూ సహకరించారు, బౌలర్లు పని చేశారు. ఆపై తిలక్ (వర్మ), సూర్య (సూర్యకుమార్ యాదవ్) వచ్చి బ్యాట్‌తో మ్యాచ్‌ని ముగించారు' అంటూ హార్దిక్ ప్రకటించాడు.

అంతా బాగానే ఉంది..

ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పు లేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మా స్పిన్నర్లకు వికెట్లు తీయగల సామర్థ్యం ఉంది. వారి ఉద్దేశ్యంతో దూకుడుగా ఉంటారు. అది నాకు నచ్చిందని తెలిపాడు.

ప్లేయింగ్ 11లో మార్పు లేదు..

ఇంతలో దాదాపు సంవత్సర కాలంగా జట్టులోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్న ఆటగాడి గుండె పగిలింది. అందులో పేసర్ అవేష్ ఖాన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. 

అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్..

అవేశ్ గతేడాది అక్టోబర్ 11న ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో వన్డే ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు.

ఏడాదిగా వెయిటింగ్..

ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. 

2 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్..

ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా గెలిచింది. దీని తర్వాత గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో విండీస్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విండీస్ ముందంజ..

ప్రొవిడెన్స్ స్టేడియంలోనే టీమ్ ఇండియా మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే చివరి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ గెలవాల్సి ఉంది. 

భారత్ గెలవాల్సిందే..