ఆ ఒక్క పరుగుతో సచిన్ జాబితాలో చేరిన శాండ్ పేపర్ ఇష్యూ ప్లేయర్
TV9 Telugu
29 January 2025
గాలే క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఉస్మాన్ ఖవాజా (65*), ట్రావిస్ (57) అర్ధశతకాలు సాధించారు.
నాలుగో స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ టెస్టులో ప్రత్యేక రికార్డును లిఖించాడు. టెస్టు క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ అద్భుతమైన రికార్డు సృష్టించాడు.
గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 1 పరుగు చేయడం ద్వారా టెస్టుల్లో 10000 పరుగులు పూర్తి చేశాడు.
ఈ ఘనత సాధించిన 3వ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (13378), అలన్ బోర్డర్ (11174) ఈ రికార్డును లిఖించారు.
ఇప్పుడు ఈ ప్రోస్ లిస్ట్ లోకి స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. అంతే కాకుండా టెస్టు చరిత్రలో 10,000 పరుగులు చేసిన ప్రపంచంలోని 15వ బ్యాట్స్‌మెన్ కూడా.
ఈ ఘనతతో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో స్టీవ్ స్మిత్ 5వ స్థానానికి చేరుకున్నాడు.
అంతకు ముందు టీమిండియా ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఐదో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 206 ఇన్నింగ్స్‌ల ద్వారా 10 వేల పరుగులు పూర్తి చేశాడు.
స్టీవ్ స్మిత్ 205 ఇన్నింగ్స్‌ల ద్వారా 10 వేల పరుగులు సాధించాడు. దీంతో టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలో 5వ బ్యాట్స్‌మెన్‌గానూ, 2వ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు.
టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 10 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు లారా, సచిన్, సంగక్కర పేరిట ఉంది. వీరు కేవలం 195 ఇన్నింగ్స్‌ల్లోనే 10000 పరుగులు పూర్తి చేశారు.