సానియ కాపురంలో చిచ్చురేపిన సనా జావేద్‌! అసలెవరీ నటి..

January 21, 2024

TV9 Telugu

పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్‌ దిగ్గజం సానిమా మీర్జాను2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో  పెళ్లి చేసుకున్నారు.  వీరికి  2018లో  కుమారుడు ఇజాన్  పుట్టాడు

సానియాతో సోయబ్‌కు రెండో పెళ్లి. అయితే 13 యేళ్ల వీరి కాపురంలో పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ చిచ్చురేపింది. తాజాగా షోయబ్‌-సనా జావేద్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌ కావడంతో ఎన్నో ప్రశ్నలు తెకపైకి వస్తున్నాయి

సానియా మిర్జాను పెళ్లి చేసుకోవడానికి ముందే సోయబ్‌కు పెళ్లైంది. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధమవడంతో.. షోయబ్‌ మొదటి భార్య ఆయేషా కోర్టు కెక్కింది

తొలుత బుకాయించినా చివరకు ఆయేషాను వివాహం చేసుకున్నట్లు సోయబ్‌ అంగీకరించాడు. 2010, ఏప్రిల్ 7న ఆమెకు విడాకులిచ్చి, రూ.15కోట్ల భరణం ఇచ్చినట్టు కూడా సమాచారం

జనవరి 20, 2024 పాపులర్‌ పాక్‌ నటి సనా జావేద్‌తో నిఖా చేసుకున్నట్టు షోయబ్‌ తన సోషల్‌ మీడియాలో ఖాతాలో ఫోటోషేర్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది

ఇక సనా జావేద్ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. షోయబ్ మాలిక్‌తో పెళ్లికి ముందు,  పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను 2020లో వివాహం చేసుకుంది

బ్యూటిఫుల్‌ కపుల్‌గా పేరుగాంచిన ఈ జంట 2023లో తమ ఇన్‌స్టా ఖాతల నుంచి వెడ్డింగ్‌, ఈద్‌ ఫోటోలను ఇద్దరూ తొలగించడంతో  వీరు విడిపోయారనే పుకార్లు గుప్పుమన్నాయి

గత ఏడాదినుంచి చట్టాపట్టాలేసుకు తిరుగుతోన్న సనా-సోయబ్‌ మార్చి 25 బహిరంగంగా తమ రిలేషన్‌ను వెల్లడించారు. దీంతో గుండె పగిలిన సానియా జీవితమంటే అంత ఈజీ కాదు. పెళ్లి, విడాకులు రెండూ కష్టమేనంటూ ఆవేదనతో పోస్ట్‌ షేర్‌ చేసింది