TV9 Telugu
04 February 2025
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి T20లో 37 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ శర్మ పేరు అందరి నోట వినిపిస్తోంది.
ముంబైలోని వాంఖడే వద్ద తుఫాను సృష్టించిన తర్వాత, అభిషేక్ ఫిబ్రవరి 3న సాయంత్రం 4:11 గంటలకు ఢిల్లీ చేరుకున్నాడు.
అదే రోజు సాయంత్రం అతను ఢిల్లీ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. అక్కడ రాత్రంతా పార్టీ జరిగింది.
అభిషేక్ సక్సెస్ పార్టీలో, వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ డీజే బ్రావో పాట ఛాంపియన్-ఛాంపియన్ చాలాసార్లు ప్లే చేశారు.
అభిషేక్ కేక్ ఈ సమయంలో ఓ కేక్ కూడా కట్ చేశాడు. అభిషేక్ ఇలా చేస్తున్నప్పుడు, రాత్రి 2:56 అయింది. ఈ సమయంలో సక్సెస్ కేక్ కూడా కట్ చేశారు.
కేక్ కటింగ్ తర్వాత, అభిషేక్ తన తల్లి నుంచి ఒక అద్భుతమైన బహుమతిని కూడా అందుకున్నాడు.
ఆ సమయానికి, రాత్రి 2:57 అయింది. నేను బ్యాట్‌ని మా అమ్మ దగ్గర నుంచి బహుమతిగా తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
పార్టీ తర్వాత, అభిషేక్ శర్మ కుటుంబం, స్నేహితులతో గ్రూప్ ఫొటో కూడా దిగారు.