15 నెలలుగా వన్డే ఆడలే.. కట్‌చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్

TV9 Telugu

19 January 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తోపాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆడనున్నాయి.

బరిలోకి 8 జట్లు

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారత జట్టు ప్రకటన

కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జనవరి 18, శనివారం విలేకరుల సమావేశంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు.

15 మంది ఆటగాళ్లు

ఛాంపియన్స్ ట్రోఫీలో నలుగురు భారత ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌లోకి పునరాగమనం చేశారు.

రీఎంట్రీ ఇచ్చిన నలుగురు

భారత జట్టులో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు 15 నెలలు, ఒకరు 16 నెలలుగా ఎలాంటి వన్డే మ్యాచ్‌లు ఆడలేదు.

15 నెలలుగా వన్డే ఆడలేదు

భారత జట్టు దిగ్గజ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతున్నాం.

ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరు?

బుమ్రా, జడేజా, షమీ తమ చివరి వన్డే మ్యాచ్‌ను నవంబర్ 19న 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఆడారు. అక్టోబర్ 19న ఇదే టోర్నీలో హార్దిక్ తన చివరి వన్డే ఆడాడు.

చివరి వన్డే 2023లో ఆడింది

ఛాంపియన్స్ ట్రోఫీలో 3 టీ20 సెంచరీలు చేసిన సంజూ శాంసన్, దేశవాళీ వన్డేల్లో 752 సగటుతో బ్యాటింగ్ చేసిన కరుణ్ నాయర్ గురించి చాలా రచ్చ జరుగుతోంది. 

2022 నుంచి ఛాన్స్ రాలే