6 బంతుల్లో 7 సిక్సర్లతో 43 పరుగులు.. భారత బౌలర్ చెత్త రికార్డ్..

ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ప్రతి ఆటగాడి కల.

కానీ, కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి.

సోమవారం భారత బౌలర్ శివ సింగ్ తన కెరీర్‌లో చెత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

మహారాష్ట్రతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ ఒకే ఓవర్‌లో 43 పరుగులు ఇచ్చాడు .

6 బంతుల్లో 7 సిక్సర్లు ఇచ్చాడు. దీంతో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు.

అతనికి ముందు, ఈ రికార్డు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫుల్లర్ పేరిట ఉంది, అతను ఒకే ఓవర్లో 38 పరుగులు ఇచ్చాడు.

మహారాష్ట్ర కెప్టెన్ రీతురాజ్ గైక్వాడ్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

వీడియో

గైక్వాడ్ 10 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. శివ వేసిన ఒక్క ఓవర్లో గైక్వాడ్ 7 సిక్సర్లు బాదాడు.

ఒక బ్యాట్స్‌మెన్‌ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.