రోజుకు రెండు లవంగాలు నమిలి తింటే బోలెడు లాభాలు.. 

02 January 2024

TV9 Telugu

లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

లవంగాలలో 'నైజీరిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. పొటాషియం, ఐర‌న్, క్యాల్షియం వంటి ఎన్నో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ లవంగంలో దొరుకుతాయి.

రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ల‌వంగాల‌ను తింటే జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. సుల‌భంగా బ‌రువు తగ్గుతారు.

ఇది శరీరం నుండి అవాంఛిత కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. భోజనం తర్వాత లవంగాలను నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది. 

నోరు దుర్వాసన వంటి అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

జలుబు దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఒ రెండు లవంగాలు వేసుకొని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి.