06 November 2023
కాంగ్రెస్ మేనిఫేస్టో రిలీజ్.. కులగణన, రైతు రుణమాఫీ, ఉచిత విద్య..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 'భరోసా కా ఘోషనా పాత్ర 2023-2028' పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓ మేనిఫెస్టో విడుదల చేసింది.
ఛత్తీస్‌గడ్‌లో తొలి విడత పోలింగ్ ప్రచార పర్వం ముగుస్తుందన్న కొన్ని గంటల ముందు మేనిఫేస్టోను ప్రకటించిన కాంగ్రెస్.
పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.
మహతరి న్యాయ యోజన్ కింద ఛత్తీస్‌గఢ్ మహిళలకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారి అకౌంట్లలో నేరుగా రూ.500 జమ.
ఛత్తీస్‌గడ్‌లో రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్ద పీట. క్వింటాల్ వరి ధాన్యానికి రూ.3,200 మద్దతు ధర.
రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం సేకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికీ కేజీ టూ పీజీ వరకూ ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపింది.
ధాన్యం పండించే ప్రతి రైతుకు రాజీవ్ గాంధీ న్యాయ యోజన కింద ఇన్‌పుట్ సబ్సిడీ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంపు. వార్షికంగా రూ.4 వేల బోనస్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి