25 July  2024

చిన్న మార్పులే, కానీ..  జీవితాన్ని మార్చేస్తాయి 

ఇప్పటికీ మనలో చాలా మంది పండ్లను తీసుకోని వారు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కచ్చితంగా ప్రతీ రోజూ కనీసం ఒక్క పండునైనా డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత అయినా ఒక పండును తీసుకోవాలి. పండ్లలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్స్‌, పోషకాలు గుండె జబ్బులను, మధుమేహం, క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది.

స్కూల్‌ పిల్లలు మొదలు, ఆఫీసులకు వెళ్లే వారు బ్యాగునుల మోస్తుంటారు. అయితే బ్యాగు బరువు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. బ్యాగు బరువు మన శరీర బరువులో 10 శాతం కన్నా మించకుండా చూసుకోవాలి. దీనివల్ల మెడ, వెన్ను, భుజం నొప్పి సమస్యలు వస్తాయి.

చక్కెరను తగ్గించడం కూడా అలవాటు చేసుకోవాలి. చక్కెరతో జీవక్రియలు, మెదడు పనితీరు మందగిస్తాయి. కాబట్టి చక్కెరను తగ్గించడం అలవాటుగా మార్చుకోవాలి.

ఎక్కువ సేపు ఒకేచోట కూర్చునే వారు అప్పుడప్పుడు లేస్తూ నడవాలి. అలాగే కూర్చుంటే కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. కాసేపు అటు, ఇటూ తిరగడం అలవాటు చేసుకోవాలి. 

ప్రతీరోజూ కచ్చితంగా కొంత దూరమైన నడవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నడక జీవితంలో ఓ భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది మంచి నిద్ర అలవాటు. సరైన నిద్రలేకపోతే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి కచ్చితంగా 8 గంటల వరకు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.