10thలో తక్కువ మార్కులు వచ్చాయా? ఉన్నత శిఖరాలకు చేర్చే టాప్ 8 కెరీర్ ఆప్షన్లు ఇవే

17 June 2024

TV9 Telugu

TV9 Telugu

పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయా? మరేం పర్వాలేదు. ఈ కోర్సులు నేర్చుకుంటే ఆర్షణీయ జీతంతోబాటు కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. ముఖ్యంగా.. మెకానిక్స్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పొందేందుకు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌) కోర్సులు చేయవచ్చు

TV9 Telugu

యానిమేషన్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించవచ్చు. అందుకు డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో చేరి కెరీర్‌ను మలచుకోవచ్చు

TV9 Telugu

గ్రాఫిక్ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, విజువల్ ఆర్ట్స్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మీ సృజనాత్మక సామర్ధ్యాలకు పదును పెట్టేందుకు ఈ కోర్సులు అనువైనవి

TV9 Telugu

హోటల్ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ఆర్ట్స్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి హాస్పిటాలిటీ యూరిజం ఇండస్ట్రీలో కెరీర్‌ను మలచుకోవచ్చు

TV9 Telugu

నానాటికీ వృద్ధి చెందుతున్న ఫిటినెస్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌, స్పోర్ట్స్‌ కోచింగ్, స్పోర్ట్స్‌ కోచింగ్‌, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు కూడా ఉన్నాయి

TV9 Telugu

ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించడం, ఎంట్రప్రెన్యుయల్‌ వెంచర్లను స్థాపించి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగవచ్చు. దీని ద్వారా మార్కెటింగ్‌, సేల్స్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి స్కిల్స్‌ అభివృద్ధి చేసుకోవచ్చు

TV9 Telugu

రిటైల్‌, సేల్స్‌, కస్టమర్‌ సర్వీస్‌ వంటి వాటిని కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చు. తద్వారా వచ్చే కమ్యునికేషన్‌, నెగోషియేషన్‌ స్కిల్స్‌ మీ సక్సెస్‌కు ఉపయోగపడతాయి

TV9 Telugu

సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడానికి కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌ వర్కింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి టెక్నికల్, ఓకేషనల్ కోర్సులు కూడా నేర్చుకోవచ్చు