దేశంలో ఎక్కువగా ఉద్యోగాలు లభించే నగరాల్లో ఛండీఘడ్ ఒకటి. ఈ నగరం దేశంలో ఆర్థికంగా ముందు వరుసలో ఉంటుంది. అలాగే ఈ నగరంలో ఐటీ, టెలి కమ్యూనికేషన్స్ రంగాలు విస్తరించాయి. చండీఘడ్‌లో సరాసరి ఏడాదికి రూ. 5.5 లక్షల జీతంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
దేశంలో ఉద్యోగవకాశాలు ఎక్కువగా లభించే నగరాల్లో గుగుగ్రామ్ ఒకటి. జెన్‌పాక్ట్, గూగుల్, మారుతి సుజికితో పాటు మరెన్నో మల్టీ నేషనల్ కంపెనీలు ఇక్కడు న్నాయి. ఈ నగరంలో ఏడాదికి సుమారు రూ. 7,50,000 జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. దేశ నలుమూలల నుంచి యువత ఉద్యోగాల కోసం ఈ నగరానికి వెళ్తుంటారు.
కోల్‌కతాలో ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తుంటాయి. ఇక్కడ ఏడాదికి సుమారు రూ. 4.5 లక్షల జీతంతో ఉద్యోగాలు ఉంటాయి. ఏడాదికి 24 శాతం గ్రోత్‌తో జీతాలు పెరుగుతాయి.
వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సురత్‌లో కూడా ఉద్యోగవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ ఉద్యోగులకు సరాసరి ఏటా రూ. 4.5 లక్షలతో జీతం లభిస్తుంది. ఏటా 14.2 శాతం శాలరీ పెరుగుదుల ఉంటుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా ఉద్యోగవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఐటీతో పాటు సినిమా ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ముంబయికి దేశ నలుమూలల ఉనంచి ఎంతో మంది వస్తుంటారు. ఇక్కడ ఏడాదికి సుమారు రూ. 5 లక్షల వేతనంతో జీతాలు లభిస్తాయి.
ఐటీతో పాటు పర్యాటకానికి పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయి. అమెజాన్, ఫేస్‌బుక్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు ఎన్నో చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ప్రతీ ఏటా దేశంలోని పలు నగరాల నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వస్తుంటారు.
ఆటోమొబైల్‌తోపాటు ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచే పుణెలోనూ ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు మంచి అవకాశాలు ఉంటాయి. పుణెలో సరాసరి రూ. 5.5 లక్షల వార్షిక ఆదాయంతో ఉద్యోగాలు లభిస్తాయి.
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరులో కూడా ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయి. ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలతో పాటు చిన్న చిన్న స్టార్టప్‌లకు కూడా బెంగళూరు ప్రసిద్ధి ఇక్కడ సగటున ఏడాదికి రూ. 6 లక్షల జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి.