సింపుల్​గా 'EPFO UAN నంబర్' ఆన్​లైన్​లో యాక్టివేట్ చేసుకోండిలా..

02 September 2023

ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగలు అందరూ కచ్చితం ఈపీఎఫ్​ఓ అకౌంట్ కలిగి ఉంటారు.  ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ పోర్టల్​లో ఈ యూఏఎన్​ నంబరు పొందే అవకాశం ఉంది.

కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా వెంటనే ఈ నంబర్ ఆటోమేటిక్​గా క్రియేట్ అవుతుంది.  ఒక సంస్థలో పీఎఫ్ అకౌంట్ కలిగిన వ్యక్తి ఎన్ని జాబ్స్ మారిన యూఏఎన్ నంబర్ మారదు.

ఈఫీఎఫ్​వో కేటాయించిన కొత్త ధ్రువీకరణ గుర్తింపు ఐడీ యూఏఎస్​ నంబర్​తో లింక్ అవుతుంది. అయితే ఉద్యోగి ఈపీఎఫ్​వో పొందడానికి యూఏఎన్ నంబర్​తో కేవైసీ లింక్ చేయాల్సి ఉంటుంది.

దాని వల్ల ఉద్యోగులు యజమాని, మధ్యవర్తుల అవసరం లేకుండా వివిధ రకాల ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతి వస్తుంది.

మొదటిగా ఈపీఎఫ్​ఓ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయినా తర్వాత స్క్రీన్​పై 'Activate UAN' అని కనిపిస్తుంది. దాని లింక్​పై క్లిక్​ చేయాలి.

తర్వాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తదుపరి వచ్చిన క్యాప్చా కోడ్​ని ఎంటర్ చేస్తే  ధ్రువీకరణ కోసం మీ రిజిస్టర్డ్​ మొబైల్ నెంబరుకు ఓ ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ చేసిన వెంటనే  వ్యాలిడేట్​​ ఓటీపీపై క్లిక్ చేస్తే చాలు యూఏఎన్​ అకౌంట్​ వెంటనే యాక్టివేట్ అవుతుంది.

ఆ తర్వాత  మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబరుకు వచ్చిన పాస్‌వర్డ్, యూఏఎన్​ నెంబర్లతో మీ ఈపీఎఫ్​ఓ ​మెంబర్ పోర్టల్‌కి లాగిన్ అవచ్చు.