ఈపీఎఫ్‌వో కొత్తరూల్‌.. ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదు!

TV9 Telugu

02 April 2024

కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయడం.

ఇప్పటి వరకు దీనికోసం కొత్త సంస్థ నుంచి మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ ప్రక్రియ తప్పనిసరి.

లేదంటే పీఎఫ్ ఖాతా సీనియారిటీ లెక్కలోకి రాదు. దీంతో ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు.

ఇకపై ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ సిస్టంతో ఈ ఇబ్బంది ఉండదని ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త రూల్‌ అమలులోకి వస్తుంది.

ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్ గా విలీనం అవుతాయి.

పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలో టెన్షన్ లేదు.

పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు కాబట్టి ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది.

ఈపీఎఫ్‌వో సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.