ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయా? మెడికల్ ఫీల్డ్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్లు ఇవే..

June 11, 2024

TV9 Telugu

TV9 Telugu

12వ తరగతి లేదా ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. తక్కువ మార్కులు వచ్చినా వైద్య వృత్తి, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు

TV9 Telugu

నర్సింగ్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, రేడియోగ్రఫీ వంటి డిప్లొమా కోర్సులు ఇంటర్‌ తర్వాత చేయొచ్చు. వీటి ద్వారా మెడికల్ ఫీల్డ్‌లో ఆకర్షణీయ జీతంతో చక్కని కొలువు మీ సొంతం అవుతుంది

TV9 Telugu

మెడికల్ అసిస్టింగ్, ఫార్మసీ టెక్నాలజీ అండ్‌ డెంటల్ అసిస్టింగ్ వంటి హ్యాండ్-ఆన్ వృత్తిపరమైన ప్రోగ్రామ్‌లు ఆరోగ్య రంగంలో  కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలను అందిస్తున్నాయి

TV9 Telugu

ఎమర్జెన్సీ వైద్య సేవలు, రోగుల సంరక్షణలో పారామెడిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కోర్సులు హాస్పిటల్ సెట్టింగ్‌లలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలు, స్కిల్స్‌ అందిస్తున్నాయి

TV9 Telugu

హెల్త్‌ వెల్ఫేర్‌ ఇండస్ట్రీ ఎక్కువగా సాంకేతికతపై ఆధారపడుతుంది. హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అండ్‌ టెక్నాలజీ కోర్సులు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, హెల్త్‌కేర్ అనలిటిక్స్, టెలిమెడిసిన్ అండ్‌ మెడికల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నిర్వహణలో టెక్-డ్రైవెన్ మెడికల్ కెరీర్‌కు బాటలు వేస్తాయి

TV9 Telugu

ఆక్యుపేషనల్ థెరపీ కోర్సులు రోగుల శారీరక, మానసిక సమస్యల నివారణకు ఉపయోగపడతాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ నైపుణ్యం కలిగిన ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా మారడానికి మంచి ఎంపిక

TV9 Telugu

ఆయుర్వేదం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలలో కూడా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. 12వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన వారు ఈ ఫీల్డ్‌లు ఎంచుకోవచ్చు

TV9 Telugu

అలాగే 12వ తరగతి తర్వాత నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎన్నో రకాల ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి ద్వారా మెడికల్ రంగంలో బెటర్‌ ఫ్యూజక్‌కు బలమైన పునాదులు ఏర్పరచుకోవచ్చు