మళ్ళీ ఉద్యోగుల తొలగింపు.. వందలమందిపై వేటు..!

TV9 Telugu

18 January 2024

2024 సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది.

ప్రముఖ బ్యాంక్‌... సిటీ గ్రూప్ జనవరి 12వ తేదీన 20,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్‌ సంస్థ హార్డ్‌వేర్‌, సెంట్రల్‌ ఇంజనీరింగ్ టీమ్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించింది.

గతేది వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌.. తన స్ట్రీమింగ్ , స్టూడియో విభాగం నుండి ఉద్యోగులను తొలగించింది.

అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియో మరియు MGM స్టూడియోస్‌లోని 35 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌ X యజమాని ఎలాన్ మస్క్ X Corp భద్రతా సిబ్బందిలో 30 శాతం మందిని తొలగించారు.

వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్‌వేర్ 1800 మంది ఉద్యోగుల తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

డిజిటల్ ప్రింటింగ్ కంపెనీ జిరాక్స్ తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను 15 శాతం వరకు తగ్గించుకోవాలని నిర్ణయించింది.