విదేశాల్లో ఉన్నత చదువులు అనగానే చాలా మందికి అమెరికానే గుర్తొస్తుంది. కానీ అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. అందుకే ఇతర దేశాలకు మొగ్గు చూపుతారు.
అమెరికాతో పోల్చితే కెనడాలో ఉన్నత చదువుకు చాలా తక్కు ఖర్చు అవుతుంది. కెనడాలో ఉన్నత విద్యనభ్యసించే వారిలో అత్యధికులు భారతీయులే. ఇక్క గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి ఏటా రూ. 10 నుంచి 20 లక్షల ఖర్చు అవుతుంది
ఇక తక్కువ ఖర్చుతో ఉన్న విద్యను పూర్తి చేయగలిగే మరో దేశం పోలాండ్. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చాలా తక్కువ ఖర్చులో పూర్తి చేయొచ్చు. ఇక్కడ చదువుకోవాలంటే ఏటా రూ. 6 లక్షలు చెల్లిస్తే చాలు.
అత్యంత తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే మరో దేశం నార్వే. నార్వేలో ఏటా రూ. 1 నుంచి రూ. 2 లక్షల్లోనే ఉన్నత చదువులు చదువుకోవచ్చు.
ఇక విదేశీ విద్యకు స్పెయిన్ కూడా పెట్టింది పేరు. ఇక్కడ కూడా తక్కువ ఖర్చులోనే విద్యను పూర్తి చేయొచ్చు. స్పెయిన్‌లో ఏటా రూ. 10 లక్షలు ఖర్చు చేస్తే చాలు ఉన్నత విద్య చదువుకోవచ్చు.
ఇటీవల జర్మనీలో ఉన్నత విద్యనభ్యసిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే ఏంటా రూ. 4 నుంచి రూ. 5 లక్షలు చెల్లిస్తే చాలు.
ఇక విదేశీ విద్యకు డెన్నార్క్‌ను కూడా ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ దేశంలో కోర్సును కేవలం రూ. 10 నుంచి రూ. 15 లక్షల్లోనే పూర్తి చేయొచ్చు.
ఉన్నత విద్యకు ఇటలీని కూడా ఎంచుకుంటున్న వారి సంఖ్య ఇటీవల భారీగానే పెరుగుతోంది. ఇటలీలో ఒక కోర్సును పూర్తి చేయాలంటే సాధారణంగా రూ. 9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.