రానున్న రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందే 7 రకాల ఉద్యోగాలు ఇవే..
March 21, 2024
TV9 Telugu
వేగంగా అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో ఉద్యోగాలను ఒడిసిపట్టాలంటే మారుతున్న కాలంతోపాటు ట్రెండ్‌లను అంచనా వేయగలగాలి. రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో జాబ్‌లు రానున్నాయి
డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్.. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న నిపుణులకు మునుముందు రోజుల్లో ఇండస్ట్రీలలో లాభదాయకమైన కెరీర్ అవకాశాలు అందిస్తాయి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్.. ఏఐలో విసృత నైపుణ్యం కలిగిన నిపుణులకు రానున్న రోజుల్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆటోమేషిన్ ఆవిష్కరణకు, డ్రైవింగ్‌కు ఇది అవసరం
హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్.. ఆరోగ్య సంరక్షణలో వేగవంతమైన విస్తవరణ జరిగే అవకాశం ఉంది. దీంతో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా వైద్యులు, అనుబంధ కార్యకర్తలకు విస్తృత అవకాశం సృష్టించనున్నారు
సైబర్ సెక్యురిటీ ప్రొఫెషనల్స్.. సైబర్ నేరాలు పెరిగే కొద్దీ వీరికి డిమాండ్ పెరుగుతుంది. సున్నితమైన సమాచారం, మౌలిక సదుపాయాల రక్షణకు సైబర్ సెక్యురిటీ ప్రొఫెషనల్స్ చాలా అవసరం
రిమోట్ వర్క్ ఫెసిలిటేటర్లు.. రిమోట్ వర్క్ చేసేందుకు అవసరమైన పరికరాలు, డిజిటల్ సహకార సాధనాలు అందించడంలో నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం
సస్లైనబిలిటీ స్పెషలిస్ట్స్.. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి పర్యావరణ అనుకూల మార్గాల వైపు సంస్థలకు దిశానిర్ధేశం చేయడానికి వీరు చాలా అవసరం
కంటెంట్ క్రియేటర్స్ అండ్ డిజిటల్ మార్కెటర్స్.. డిజిటల్ మీడియా ప్రాముఖ్యతకు నైపుణ్యం కలిగిన కంటెంట్ సృష్టికర్తలు, డిజిటల్ విక్రయదారులు అవసరం. బిజినెస్ ఆడియన్స్, అభివృద్ధికి వీరు చాలా కీలకం