ఈ ఆధార్‌ సేవలకు.. మొబైల్‌ నెంబర్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. 

11 January 2024

TV9 Telugu

ఆధార్‌కార్డును మరింత సురక్షితంగా మార్చేది ఆధార్‌ పీవీసీ కార్డు. అయితే ఈ కార్డును ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడనికి మీ ఆధార్‌ మొబెల్‌ నెంబర్‌కు రిజిస్టర్‌ కావాల్సిన అవసరం లేదు. 

ఆధార్‌ పీవీసీ కార్డు అప్లై చేసుకోవడానికి ఎలాగైతే మొబైల్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదో. అలాగే.. అంతకుముందు ఆర్డర్‌ చేసిన పీవీసీ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవడానికి కూడా మొబైల్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. 

మీ ఆధార్‌ కార్డులో అడ్రస్‌లాంటివి ఏమైనా అప్‌డేట్ చేసుకున్న సమయంలో వాటి అప్‌డేట్స్‌ను తెలుసుకోవడానికి కూడా మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్‌ కావాల్సి అవసరం లేదు. 

ఇక మీకు సమీపంలో ఉన్న ఆధార్‌ సేవ కేంద్రాలను ఆన్‌లైన్‌లోనే సింపుల్‌గా తెలుసుకోవచ్చనే విషం తెలిసిందే. అయితే ఈ సేవలు పొందడానికి కూడా ఎలాంటి మొబైల్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. 

ఆధార్‌ అప్‌డేట్‌ కోసం లేదా, ఎన్‌రోల్‌మెంట్‌ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకునే క్రమంలో కూడా ఆధార్‌, మొబైల్ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ కావాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌ నెంబర్‌ లింక్‌ లేకపోయిన ఈ పని చేసుకోవచ్చు.

కొత్త అడ్రస్‌కు మార్చుకుంటున్న సమయంలో యూఐడీఏఐ వాలిడేషన్‌ నిర్వహిస్తుంది. అయితే దీనికి కూడా మొబైల్ నెంబర్‌ ఆధార్‌ లింక్‌ కావాల్సిన అవసరం లేదు.

ఒకవేళ మీ ఆధార్‌ కార్డుకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు చేసేవి ఉన్నా మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. వెబ్‌సైట్‌ లేదా 1947 నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. 

ఒక మీరు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్‌ను కూడా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ లేకుండా చెక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌కు మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ లేకుండానే ఇవన్నీ చేసుకోవచ్చు.