ఇకపై 5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. 

Ravi Kiran

05 June 2024

చాలా మంది రైలు ప్రయాణం కోసం ముందుగానే టికెట్స్‌ బుక్‌ చేసుకుని టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే రెండు ఛార్ట్‌లను రెడీ చేస్తుంటుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రెడీ చేస్తుంది.

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

ఇక రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు తయారు చేస్తుంది. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించేవారు. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పిస్తున్నారు రైల్వే అధికారులు. రైలు బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది రైల్వే. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

అయితే బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మధ్య స్టేషన్ నుంచి కావాలంటే అనుమతి ఉండదు. ఇక వేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది.

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

IRCTC యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఛార్ట్‌ వేకేన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేయొచ్చు. అక్కడ ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేసి GET TRAIN CHARTపై క్లిక్‌ చేయాలి. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

వెంటనే అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. కోచ్‌ నంబర్‌, బెర్త్‌… మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు

ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా మీరు టీటీఈని మధ్య స్టేషన్లలో సంప్రదించి.. టికెట్ బుక్ చేయవచ్చు. 

5 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు