జనరల్ టికెట్ కోసం లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే..
Ravi Kiran
22 Aug 2024
రైలులో ప్రయాణించేందుకు జనరల్ టికెట్స్ కోసం కచ్చితంగా స్టేషన్‌కు వెళ్లి, లైన్‌లో గంటల తరబడి నిలబడాల్సిన పన్లేదు. జనరల్ టికెట్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.
జనరల్ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది రైల్వే శాఖ. యూటీఎస్ యాప్ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే జనరల్ టికెట్‌ను సైతం బుక్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌ను రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ చాలామంది ఈ యాప్‌పై అవగాహన లేకపోవడంతో ఇంకా లైన్‌లో నిలబడి టికెట్‌ను కొనుగోలు చేస్తున్నారు.
కేవలం జనరల్ టికెట్లు మాత్రమే కాకుండా ప్లాట్ ఫార్ టికెట్లు, సీజన్ టికెట్స్‌ను సైతం ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం ముందు మీ స్మార్ట్ ఫోన్‌లోని ప్లే స్టోర్‌లోకి వెళ్లాలి. అనంతరం యూటీఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం మీ పేరు, ఫోన్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి వివరాలతో యాప్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
మీ ఫోన్ నెంబర్, ఎంచుకున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా యాప్‌లోకి లాగిన్ కావాలి. ఓపెన్‌కాగానే యాప్‌లో టికెట్ క్యాటగిరీలు కనిపిస్తాయి ఇందులో నార్మల్ బుకింగ్ ఆప్షన్‌లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్‌ఫామ్ టికెట్ల ఆప్షన్స్ కనిపిస్తాయి.
మీకు కావాల్సిన క్యాటగిరీని ఎంచుకోవాలి. జనరలల్ కేటగిరీని సెలక్ట్ చేసకోవాలి. అనంతరం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు, ఎంత మంది ప్రయాణిస్తున్నారు సెలక్ట్ చేసుకోవాలి.
చిన్న పిల్లలు ఉంటే వారి వివరాలను కూడా నమోదు చేయాలి. అనంతరం క్యాష్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు డిజిటల్ పేమెంట్స్‌తో పేమెంట్ చేసుకోవచ్చు.
పేమెంట్ పూర్తికాగానే టికెట్ కొనుగోలు పూర్తయినట్లే. అయితే మీరు ఏరోజు ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ రోజు టికెట్ బుక్ చేసుకుంటేనే వర్తిస్తుంది. ముందు రోజు టికెట్ బుక్ చేసుకుంటే చెల్లదు.