ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. బెర్త్ కన్ఫర్మ్ అవ్వడం పక్కా..!

Ravi Kiran

22 June 2024

ప్రతీసారి రైలు ప్రయాణం చేసేటప్పుడు.. కన్ఫర్మ్ టిక్కెట్లు దొరకడం కష్టమే. కొన్నిసార్లు అవైలబిలిటీ ఉన్న సీట్లు పూర్తికాగానే వెయిటింగ్ లిస్టు టిక్కెట్లను జారీ రైల్వే శాఖ.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

అలాంటప్పుడు కొన్నిసార్లు మీ ట్రైన్‌ టికెట్‌పై GNWL/WL లాంటి నంబర్‌తో టికెట్‌ జారీ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు టికెట్‌పై ఉన్న వెయిటింగ్ లిస్టు నంబర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఉదాహరణకు మీ రైలు టికెట్‌పై GNWL40/WL20 అని ఉంటే.. మొత్తం 40 మంది వెయిటింగ్ లిస్టు జాబితాలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే.. 20 మంది రద్దు చేసుకోగా..

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నది 20 మంది మాత్రమేనని అర్ధం. ఈ విషయాన్ని మీరు మరొకసారి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు గమనించండి.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఇక తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. టికెట్ వెయిటింగ్ లిస్టు వస్తే అది TQWLగా సూచిస్తుంది. తత్కాల్ కోటా.. ప్రతీ రైలుకు విభిన్నంగా ఉంటుంది.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

కొన్ని రైళ్లలో తత్కాల్ కోటాకు సీట్లు తక్కువ ఇస్తే.. ఇంకొన్ని రైళ్లకు ఎక్కువ సీట్లు తత్కాల్ కోటాలో ఉంచుతుంది రైల్వే శాఖ.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఇక ఛార్ట్ రూపొందించే సమయంలో తొలుత జనరల్ వెయిటింగ్ లిస్టుకే ప్రాధాన్యత కల్పిస్తుంది రైల్వే శాఖ. అందుకే మీకు తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్టు వచ్చినా.. అది కన్ఫర్మ్ కావడం చాలా తక్కువ.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని తత్కాల్ వెయిటింగ్ లిస్టు టికెట్‌ కన్ఫామ్‌ కాకపోతే.. రైలు ప్రయాణానికి అనుమతించరు. ఛార్ట్ ప్రిపేర్‌ చేసే సమయంలోనే ఆ టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్‌ అవుతుంది.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఈ రెండింటితో పాటు టికెట్‌పై పూల్డ్‌ కోటా (PQWL), రిమోట్‌ లొకేషన్ కోటా (RQWL) అని కూడా ఉంటాయి. రైలు బయల్దేరే, చేరుకునే స్టేషన్లు కాకుండా.. మధ్యలో ఉండే స్టేషన్లకు మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్నారని అనుకుందాం.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

అలా వచ్చే వెయిటింగ్ లిస్టును రిమోట్‌ కోటా కింద ఇస్తారు. ఇక తక్కువ దూర ప్రయాణానికి పూల్డ్‌ కోటా టికెట్లు కేటాయిస్తారు. 

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే.. 

ఈ రెండు కోటాలలో వెయిటింగ్ లిస్టు టిక్కెట్లు కన్ఫర్మ్ కావడం చాలా రేర్. కాబట్టి మీరు మళ్లీసారి రైలులో ప్రయాణించే ముందు వీటిని తప్పనిసరిగా గమనించండి.

ట్రైన్‌ టికెట్‌పై వీటిని గమనిస్తే..