విమానంలో ప్రయాణించేప్పుడు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెట్టాలో తెలుసా?

01 October 2024

TV9 Telugu

TV9 Telugu

స్మార్ట్‌ఫోన్‌లోని అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఒకటి. దాదాపు అందరి ఫోన్లలో ఎయిర్ ప్లేన్ మోడ్ ఉంటుంది. అయితే విమానంలో ప్రయాణించేప్పుడు ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయమని చెప్పడం మీరు వినే ఉంటారు

TV9 Telugu

ఎందుకు అలా చేయాల్సి ఉంటుంది? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా.. విమానంలో ప్రయాణించేటప్పుడు మీ మొబైల్‌ ఫ్లైట్ మోడ్‌లో ఉంచకపోతే మీరు ప్రయాణించే విమానం ప్రమాదంలో పడుతుంది మరి

TV9 Telugu

నిజానికి చాలా యేళ్ల క్రితమే విమానయాన సంస్థలు మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇ-రీడర్‌లు వంటి పరికరాలను ఫ్లైట్లో వెళ్లే సమయంలో ఆఫ్ చేయమని ప్రయాణికులకు చెప్పడం మానేశాయి. ఎందుకంటే దాదాపు అన్ని పరికరాలు ఇప్పుడు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ వినియోగిస్తున్నాయి

TV9 Telugu

అయితే, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే, అది విమానాలను నడిపే పైలట్లకు ఇబ్బందులను కలిగిస్తుంది. ఫ్లైట్ సమయంలో మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం వల్ల విమానం కమ్యూనికేషన్ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది

TV9 Telugu

ఫ్లైట్ సమయంలో, పైలట్లు ఎల్లప్పుడూ రాడార్, కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉంటారు. ఈ సమయంలో అక్కడి ప్రయాణికుల ఫోన్ ఆన్‌లో ఉంటే, పైలట్‌లకు సూచనలు స్పష్టంగా రావు

TV9 Telugu

సెల్యులార్ కనెక్టింగ్ ఫీచర్‌ని కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియో తరంగాలను, ఇతర కనెక్ట్ చేసే లక్షణాలతో ఇబ్బందులు కలిగిస్తాయి. ఇది విమానానికి అంతరాయం కలిగిస్తాయి

TV9 Telugu

అందుకే విమానంలో ప్రయాణించేటప్పుడు, ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ప్రతి రోజూ మిలియన్ల మంది విమానంలో ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంలో నెట్‌వర్క్‌లలో భారీ అంతరాయాలు ఉంటాయి

TV9 Telugu

ఇది విమానయాన సంస్థలకు కూడా సమస్యలను సృష్టిస్తుంది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో సిగ్నల్స్ సమస్యలు రావొచ్చు. అందుకే విమానంలో ప్రయాణించేటప్పుడు మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలని చెబుతారు