6 September 2023
వచ్చే పండుగ సీజన్‌లో వోల్వో నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు సీ40
మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతుండటంతో ఎంతో మంది వాటిపై చాలా మందికి ఆసక్తి పెరిగింది
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు
తాజాగా స్వీడన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది
వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది
ఈ వోల్వో ఎలక్ట్రిక్ కారు ధరను 61.25 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు వోల్వో కంపెనీ వెల్లడించింది
అత్యాధునిక ఫీచర్లను జోడించి ఈ వోల్వో ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు
వచ్చే పండుగ సీజన్‌లో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాలకు మించి రాణించనుందని భావిస్తున్నామని ఎండీ అన్నారు
ఈ వోల్వో ఎలక్ట్రిక్ కారులో అత్యాధునిక సదుపాయాలతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం ఉండేలా రూపొందించినట్లు చెప్పారు
ఇక్కడ క్లిక్ చేయండి