21 October 2023
టీవీఎస్ జూపిటర్ 125 లో కొత్త డిజైన్ చేసిన వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
అదనపు రైడర్ సౌలభ్యం కోసం కనెక్ట్ చేసిన ఫీచర్లతో టీవీఎస్ జూపిటర్ 125 మార్కెట్‌లో విడుదల చేసింది కంపెనీ.
టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ స్మార్ట్‌ఎక్స్ కనెక్ట్ సూట్‌తో పాటుఆకర్షణీయంగా ఉంటుంది. అందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ
జూపిటర్ స్కూటర్‌లో బ్లూటూత్ ఎనేబుల్ చేసిన టీఎఫ్‌టీ స్క్రీన్‌తో పాటు క్లస్టర్ ద్వారా స్మార్ట్ ఎక్స్ టాక్, స్మార్ట్ ఎక్స్ ట్రాక్ ఫీచర్లకు మరింత మద్దతు ఇస్తుంది.
టీవీఎస్ జూపిటర్ రైడర్ రైడ్ చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను కూడా వీక్షించే విధంగా ఇందులో ఫీచర్ ఉంది.
రియల్ టైమ్ స్పోర్ట్స్ స్కోర్‌ల, వాతావరణ అప్‌డేట్‌లు, న్యూస్ అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి వీలుగా ఫీచర్ ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్ 125 స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ ఎలిగెంట్ రెడ్, మాట్ కాపర్ బ్రాంజ్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లతో కంపెనీ లాంచ్ చేసింది.
జూపిటర్ స్ట్రాట్ ధరలు రూ. 86,305 నుంచి రూ. 96,655 వరకూ ఉంటాయి. లీటర్ పెట్రోల్‌కు 57.27 కిలోమీటర్ల మైలేజీ