రైల్లో ప్రయాణిస్తే ఈ రూల్స్‌ తెలుసుకోండి.. లేకుంటే జరిమానా, జైలు శిక్ష

03 June 2024

TV9 Telugu

మీరు రైలులో ప్రయాణించే ముందు  కొన్ని రూల్స్‌ తెలుసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష పడవచ్చు.

నిబంధనలు

మీరు మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నట్లయితే, దానికి కాలపరిమితి కూడా ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను తిరస్కరించకూడదు.

బెర్త్‌లు

మీరు మీ రైలును మిస్ అయినట్లయితే మీ సీటు కేవలం 2 స్టేషన్లు లేదా 1 గంట పాటు వేరొకరి పేరు మీద కేటాయించరు. ఆ తర్వాత టీటీఈ మరొకరికి కేటాయించవ్చు.

ట్రైన్‌ మిస్‌

రైల్వే నిబంధనల ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు. దీంతో పాటు 10 గంటలకు రైలు లైట్లు కూడా ఆపివేయవచ్చు.

రూల్స్‌

ఏసీ బోగీలో 70 కిలోలు, స్లీపర్ కోచ్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 35 కిలోలు తీసుకెళ్లవచ్చు. అయితే ఇంతకు మించి లగేజీని తీసుకెళ్లే అదనపు ఛార్జీలు ఉంటాయి.

లగేజీ

మీరు కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణిస్తే, రైల్వే రూల్స్‌  ప్రకారం ప్రయాణించవచ్చు. కానీ మీరు ఈ-టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు.

వెయిటింగ్‌ టికెట్‌

రైల్వే బోగీకి బిగించిన చైన్ లాగితే జరిమానాతో పాటు జైలు శిక్ష. చైన్ లాగడం అత్యవసర సమయంలో మాత్రమే అనుమతి ఉంటుంది.

చైన్‌ లాగితే

రైలులో విక్రయించే ఆహార పదార్థాలపై అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు. వీటితోపాటు ఆహారంలో నాణ్యత కూడా ఉండాలి.

ఆహారాలు