అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే.. 

Narender Vaitla

05 December 2024

అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితాలో మారుతీ సుజుకీ బాలెనో మొదటి స్థానంలో నిలిచింది. 16,293 యూనిట్ల అమ్మకాలతో ఈ కారు దూసుకెళ్తోంది.

ఇక రెండో స్థానంలో హ్యుందాయ్‌ క్రెటా ఉంది. ఈ కారు నవంబర్‌లో 15,452 అమ్మకాలు జరిగాయి.

గత నెలలో అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితాలో టాటా పంచ్‌ మూడో స్థానంలో నిలిచింది. నవంబర్‌లో 15,435 కార్ల అమ్మకాలు జరిగాయి.

టాటా కంపెనీకి చెందిన మరో కారు 4వ స్థానం దక్కించుకుంది. టాటా నెక్సాన్ 15,329 అమ్మకాలు జరుపుకుంది.

ఇక మారుతీ సుజుకీకి చెందిన ఎర్టిగా 5వ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ కారు 15,150 అమ్మకాలు జరిగాయి.

తర్వాతి స్థానంలో మారుతీ సుజుకీ బ్రీజా ఉంది. ఈ కారు గత నెలలో 14,918 అమ్మాకలు జరిగాయి.

దేశంలో అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితాలో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ 7వ స్థానంలో ఉంది. ఈ కారు 14,882 అమ్మకాలు జరిగాయి.

ఇక ఇండియన్స్‌ ఎక్కువగా ఇష్టపడే మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ 8వ స్థానంలో నిలిచింది. ఈ కారు 14,737 అమ్మకాలు జరిగాయి.

మారుతీ సుజుకీ చెందిన మరో బెస్ట్‌ కారు వ్యాగన్‌ ఆర్‌ 9వ స్థానం దక్కించుకుంది. గత నెలలో 13,982 అమ్మకాలు జరిగాయి.

 ఇక గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితాలో మహీంద్రా స్కార్పియో  10వ స్థానంలో నిలిచింది. 12,704 అమ్మకాలు జరిగాయి.