మార్కెట్లో దుమ్మురేపుతున్న సీఎన్‌జీ కార్లు.. ఈ మూడు కార్లకు భలే డిమాండ్
09 August 2023
ఈవీతో పాటు సీఎన్‌జీ, ఎల్‌పీజీవీ వాహనాలు ఉన్నాయి. వీటిలో ఈవీలు అత్యధిక ధర ఉండటంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు
తక్కువ ధర కలిగిన సీఎన్‌జీ మాడళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా ఇవ్వడం ఇందుకు కారణం
బీఎస్6 నిబంధనలు మరింత కఠినతరమవుతుండటం కూడా సీఎన్‌జీ వాహనాలకు గిరాకీ పెరగడానికి ప్రధాన కారణం
టాటా పంచ్ కూడా సీఎన్‌జీ కూడా వచ్చింది. సన్‌రూఫ్ కలిగిన ఈ మాడల్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 27 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది
టాటా టియాగోలో సీఎన్‌జీ వెర్షన్‌లో వచ్చింది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో దీని ధర రూ.6.55 లక్షలు. 27 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది
ఆల్టో 800ని సీఎన్‌జీలో వచ్చింది. దీని ధర రూ.5.13 లక్షలు. ఈ కారు 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది
సెలేరియాలో సీఎన్‌జీ వెర్షన్‌లో వచ్చింది. ధర రూ.6.73 లక్షల నుంచి ప్రారంభం. 34.47 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. పెట్రోల్ మాడల్ 26.68 కిలోమీటర్లు మైలేజీ
మారుతి సుజుకి బ్రెజ్జా S- సీఎన్‌జీలో వచ్చింది. దీని ధర 9.24 లక్షల నుంచి ప్రారంభం ఇది 25.51 కిమీమీటర్ల మైలేజీ ఇవ్వనుంది