ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు
అమెరికా:ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఉన్న అమెరికాలో 8,133.46 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి
జర్మనీ:పశ్చిమ ఐరోపాలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉన్న జర్మనీలో 3,354.89 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
ఇటలీ:
ఇటలీలో 2,451.84 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో ఇటలీ మూడవ స్థానంలో ఉంది.
ఫ్రాన్స్;ఫ్రాన్స్‌లో 2,436.81 టన్నుల బంగారు నిల్వ ఉంది. దీనితో దేశం పశ్చిమ ఐరోపాలో మూడవ అతిపెద్ద బంగారు నిల్వలున్న దేశంగా, ప్రపంచ వ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది.
రష్యన్ ఫెడరేషన్:
తూర్పు ఐరోపాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న రష్యాలో 2,326.52 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇది నాలుగో స్థానంలో ఉంది.
చైనా:
పొరుగున ఉన్న చైనా వద్ద 2,068.36 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈ దేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది.
స్విట్జర్లాండ్:
పశ్చిమ ఐరోపాలో అత్యధిక ఆదాయం కలిగిన దేశంగా ఉన్న స్విట్జర్లాండ్‌లో 1,040.00 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ దేశం ఏడో స్థానంలో ఉంది.
జపాన్:
జపాన్‌లో 846 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీంతో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.
భారతదేశం:
భారతదేశంలో 794.62 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. మన దేశం 9వ స్థానంలో ఉంది.
నెదర్లాండ్స్:
నెదర్లాండ్స్ దేశంలో 612.45 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది. టాప్ 10 జాబితాలో 10వ స్థానంలో ఉంది.