గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టామాట ధరలు..

10 August 2023

Pic credit - Freepik

కూరగాయల మార్కెట్‌లలో గతకొన్ని రోజుల నుంచి టామాట ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే.. ధరలు భారీగా పెరగడంతో జనం బెంబేలెత్తిపోయారు.

కిలో టమాట ధర రూ.150 నుంచి.. 200లకు పైగా పలికింది. కొన్ని చోట్ల రూ.300 ల వరకు కూడా టమాటలను విక్రయించారు.

పెరుగుతున్న ధరలతో లబోదిబోమంటున్న ప్రజలకు కొంచెం ఉపశమనం లభించింది. ఇటీవల భారీగా పెరిగిన టమాట ధరలు క్రమంగా పతనమవుతున్నాయి.

తాజాగా.. ఏపీ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌యార్డులో టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 

ఇటీవల మార్కెట్ చరిత్రలోనే కిలో టమాటా అత్యధికంగా రూ.196 వరకు పలికింది. అయితే, దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు తగ్గాయి.

బుధవారం వరకు అత్యధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉండగా.. గురువారం టమాట ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 

గురువారం ఏ గ్రేడ్ కిలో టమాటా ధర రూ.50 నుంచి రూ.64 వరకు నమోదైంది. బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకు టమాట ధరలు నమోదయ్యాయి. 

సగటున కిలో టమాటా ధర రూ.44 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.