05 September 2023

పిల్లలకూ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా.. 

పిల్లల కోసం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లు ఉన్నాయి తెలుసుకుందాం. 

ప్రినేటల్  కవరేజ్: ఇది కన్సీవ్  అయిన దగ్గర నుంచి డెలివరీ వరకూ ఇచ్చే కవరేజ్.

 డెలివరీ ముందు లేదా తరువాత వచ్చే అనారోగ్య పరిస్థితులను కవర్ చేస్తుంది. 

 ఈ పాలసీలకు 24-48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది 

పుట్టిన వెంటనే: అప్పుడే పుట్టిన పాపాయికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసే పాలసీలు ఉన్నాయి. 

 కొన్ని పాలసీలు 90 రోజుల తరువాత ఆరోగ్య రక్షణ ఇస్తాయి. 

కొన్ని పుట్టిన తేదీ నుంచీ కవర్ చేస్తాయి. వ్యాక్సినేషన్ కవర్ చేసే పాలసీలు కూడా ఉన్నాయి. 

చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకూ : చిన్నప్పటి నుంచి టీనేజీ వరకూ పిల్లలు తరచో ఇన్ ఫెక్షన్లకు గురవుతారు. 

అలాగే జన్యుపరమైన వ్యాధులతోనూ ఇబ్బంది పడతారు. అందుకే పెద్దలతో పాటు పిల్లలకు ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. 

పిల్లల కోసం ప్రత్యేక పాలసీ తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లో పిల్లలను చేర్పించవచ్చు.