05 September 2023

ఇల్లు కొన్న తరువాత ఉండే ఖర్చులకు బడ్జెట్ చేసుకున్నారా?

స్వంత ఇల్లు అందరికీ ఉండే కల. దీనికోసం డబ్బు సమకూర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు. 

కొంత డబ్బు సమకూర్చుకుని.. మరికొంత లోన్ తీసుకుని ఇల్లు కొంటారు. 

ఇల్లు కొనేటప్పుడు ఇంటి ఖరీదు లేదా నిర్మాణ ఖర్చు అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. 

దానికి అవసరమైన డబ్బు సమకూర్చుకుంటారు. ఇల్లు కొనుక్కున్న తరువాత కూడా ఖర్చులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయి. 

తీరా ఇల్లు కొన్నాకా.. వచ్చే ఖర్చులకు డబ్బు చేతిలో లేక వాయిదాలు వేస్తారు. 

ఇల్లు కొన్నాకా ఉండే ఈ ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇల్లు కొనడానికి బడ్జెట్ చేసుకుంటే మంచిది. 

 1. ఇంటీరియర్ ఖర్చు,  2. అపార్ట్ మెంట్ అయితే బాల్కనీ, మెయిన్ డోర్ కి ఏర్పాటు చేసుకోవాల్సిన ఐరన్ గ్రిల్ 3. ఇంటికి ఇన్సూరెన్స్, 

 4. అసోసియేషన్ ఫీజులు  5. ఫర్నీచర్, 6. పెస్ట్ కంట్రోల్ 

ఈ ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ చేసుకుంటే.. ఇల్లు కొనుక్కున్నాకా వీటి కోసం హైరానా పడకుండా ఉండవచ్చు.