ఓలా నుంచి అత్యంత చవకైన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..
అత్యాధునిక సాంకేతికతను స్కూటర్లలో మిక్స్ చేస్తూ వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా స్కూటర్లను తీసుకొస్తుంది
ఈ క్రమంలోనే ఇటీవల ఓలా కంపెనీ అత్యంత చవకైన సరికొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కంపెనీ
బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా నుంచి వచ్చిన ఈ ఎస్1ఎక్స్ స్కూటర్ ను ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ ఆవిష్కరించారు
త్వరలో డెలివరీ ప్రారంభించే ఈ స్కూటర్‌ను రెండు రోజుల క్రితం సీఈవో భవిష్ తన ట్విట్టర్ ఖాతాలో ఎస్1ఎక్స్ స్కూటర్‌పై కూర్చొని దిగిన ఫోటోను షేర్ చేశారు
ఈ పోస్టులో రెండు ఫొటోలు ఉన్నాయి. దానికి ఆయన ఒక్కరే స్కూటర్ పై దిగిన ఫొటో కాగా, మరొకటి తన బృందం కలిసి దిగిన ఫొటో కావడం విశేషం
ఓలా ఎలక్ట్రిక్ నుంచి వస్తున్న ఈ కొత్త చవకైన స్కూటర్ ఓలా ఎస్1ఎక్స్ మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. త్వరలో డెలివరీలు కూడా ప్రారంభించనుంది
దీని ప్రారంభ ధర రూ. 79,999కాగా, ప్రస్తుతం రూ. 89,999. 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఎస్1ఎక్స్ వేరియంట్ రూ.89,999 ప్రారంభ ధర కాగా, ఇప్పుడు రూ.99,999
అదే విధంగా ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ ధర ప్రారంభంలో రూ.99,999కాగా, ఇప్పుడు దాని ధర రూ. 1,09,999గా ఉంది. ఓలా నుంచి తక్కువ ధరల్లో స్కూటర్లు తీసుకొస్తుంది