అద్భుతమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జింగ్‌తో 170 కిలోమీటర్లు

12 May 2024

TV9 Telugu

మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో సరికొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈవీ వాహనాల హవా

తక్కువ ధరల్లో  ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

మైలేజీ విషయంలో

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంస్థ ఐవూమి..దేశీయ మార్కెట్‌కు నయా స్కూటర్‌ జీత్‌ఎక్స్‌ జెడ్‌ఈని పరిచయం చేసింది. 

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంస్థ ఐవూమి

సింగిల్‌ చార్జింగ్‌తో 170 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్‌ ధరను రూ.80 వేలుగా నిర్ణయించింది వాహన తయారీ కంపెనీ.

సింగిల్‌ చార్జింగ్‌తో

గంటకు 57 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్‌ బ్యాటరీ 5.5 గంటల్లో పూర్తిస్థాయిలో చార్జింగ్‌ కానుందని కంపెనీ నివేదికలు చెబుతున్నాయి.

బ్యాటరీ సామర్థ్యం

3 కిలోవాట్‌, 2.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్‌తో ఈ స్కూటర్లను తీర్చిదిద్దింది సంస్థ. బ్యాటరీపై ఐదేండ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వారెంటీని కల్పిస్తుంది.

బ్యాటరీ బ్యాకప్‌

డిస్క్‌ బ్రేక్‌, యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటీ కంట్రోల్‌తోపాటు ఇతర ఫీచర్లతో ఈ బైకును తయారు చేసింది.

డిస్క్‌ బ్రేక్‌

అయితే ఈ స్కూటర్‌కు స్మార్ట్‌ఫోన్‌ను కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్లూటూత్‌ కనెక్టివిటీతో ఎస్‌ఎస్‌ఎం, కాల్‌ అలర్ట్‌ను తెలుసుకోవచ్చును.

స్మార్ట్‌ ఫోన్‌ కనెక్ట్‌