ఇటీవలే టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ఆవిష్కరించింది
ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో ఆల్ట్రోజ్ సీఎన్జీని విడుదల చేసిన తొలి సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ, మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు బాలెనో సీఎన్జీ మధ్య ధరల్లో తేడాలు ఉన్నాయి. వాటి వివరాలు ఏంటో చూద్దాం
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ గత మే నెలలో ఆవిష్కరించారు. దీని ధర రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ఎక్స్ఈ, ఎక్స్ఎం+, ఎక్స్ఎం+ (ఎస్), ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్+ (ఎస్), ఎక్స్‌జడ్+ ఓ (ఎస్) వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది
ఈ కారు 1.2 లీటర్ల రివట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 72.4 బీహెచ్పీ, 103 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది
మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ వేరియంట్ తో పోలిస్తే టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు మైలేజీ తక్కువ ఇస్తుంది
ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ధర రూ.7.55 లక్షల నుంచి ప్రారంభమైతే.. మారుతి బాలెనో సీఎన్జీ వేరియంట్ రూ.8.35 లక్షల నుంచి మొదలవుతుంది
బేస్ మోడల్ కార్ల ధరల ప్రకారం టాటా ఆల్ట్రోజ్ సుమారు రూ.80వేలు తక్కువ ధర పలుకుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ కార్లలో మారుతి బాలెనో కంటే ఆల్ట్రోజ్ కారు రూ.1.25 లక్షలు తక్కువకే లభిస్తుంది