18 April 2024
TV9 Telugu
ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఒక్కరు షాపుల్లో కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా ఆర్డర్లు బుక్ చేసుకుంటున్నారు
ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘స్విగ్గీ’ తన అనుబంధ క్విక్-కామర్స్ ‘ఇన్‌స్టామార్ట్’తో తన వ్యాపార విస్తరణ దిశగా ప్రణాళిక రూపొందించింది
ఇప్పటి వరకూ ఫుడ్, రోజువారీ గ్రాసరీ వస్తువులను మాత్రమే పంపిణీ చేసిన ఇన్‌స్టామార్ట్ ఇక దుస్తులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్టేషనరీ సహా 35 రకాల వస్తువులను డెలివరీ చేయనుంది
కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తన రిటైల్ విభాగం ‘స్విగ్గీ మాల్ (Swiggy Mall)’ను ఇన్‌స్టామార్ట్‌తో లింక్ చేస్తున్నట్లు తెలిపింది
ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మాదిరిగానే అన్ని రకాల వస్తువులను సరఫరా చేసే ప్లాట్ ఫామ్ ‘స్విగ్గీమాల్’.. బుక్ చేసిన గంటలోపే సంబంధిత కస్టమర్‌కు డెలివరీ
ఇప్పటికే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో స్విగ్గీమాల్ తన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 25కి పైగా నగరాల్లో ఇన్‌స్టామార్ట్ సేవలను అందిస్తోంది
తాజాగా స్విగ్గీ అనుబంధ స్విగ్గీమాల్, ఇన్‌స్టామార్ట్ మధ్య అనుసంధానించిన 35 పై చిలుకు క్యాటగిరీల ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చని స్విగ్గీ ఇన్ స్టామార్ట్ హెడ్ ఫణి కిషన్ తెలిపారు
వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు 35కుపైగా కేటగిరిల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు