వినియోగదారులకు షాక్‌.. పెరగనున్న స్మార్ట్‌ టీవీల ధరలు..  కారణం ఏంటంటే

30 March 2024

TV9 Telugu

చాలా మంది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో స్మార్ట్ టీవీలు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా స్మార్ట్‌ టీవీల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆన్‌లైన్‌

అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్‌ ధరలు పెరగడంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని కౌంటర్‌పాయింట్స్‌ ఐవోటీ సర్వీస్‌ వెల్లడించింది. 

ప్యానెల్‌ ధరలు

దేశీయంగా ప్రీమియం మాడళ్లకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో స్మార్ట్‌ టీవీ దిగుమతులు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రీమియం మోడళ్లు

కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా అతిపెద్ద స్క్రీన్‌ టీవీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది.

అప్‌గ్రేడ్‌

అయితే ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా స్మార్ట్‌ టీవీలవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

ఆఫ్‌లైన్‌తో పోలిస్తే 

ఇక చాలా మంది ప్రీమియం మాడళ్లను సైతం ఆన్‌లైన్‌లో చూసి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ సైట్లకు మరింత క్రేజ్‌ పెరిగింది.

 ప్రీమియం మాడళ్లు

ప్రీమియం టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌తో సరాసరి వీటి విక్రయ ధర కూడా అధికం కాబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రీమియం టీవీలకు

దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్‌ టీవీల వాటా 93 శాతంగా ఉంది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని తన నివేదికలో వెల్లడించింది. 

దేశీయంగా