ఏపీ మీదుగా వందే స్లీపర్.. ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే.!

Ravi Kiran

07 June 2024

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

వీటి ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా కొత్త సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేనుందట. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

వందేభారత్ స్లీపర్ తొలి విడతలోనే సికింద్రాబాద్ - పూణే మధ్య అందుబాటులోకి రానుంది. ఈ వందేభారత్ స్లీపర్‌ను తొలి విడత ఖరారులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా నిర్ణయం జరిగింది. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

సికింద్రాబాద్-పూణే మధ్య ప్రవేశపెట్టే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను భర్తీ చేయనుందట. ఈ రెండు నగరాలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సుమారు 8 గంటల 25 నిమిషాలలో కవర్ చేస్తోంది. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

ఇప్పుడు ఆ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రీప్లేస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు రైల్వే అధికారులు. ఆ రైలు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తే.. ప్రయాణ సమయం ఒక గంట తగ్గుతుందట. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

దీంతో రద్దీ మార్గంగా ఉన్న సికింద్రాబాద్ - పూణే మార్గంలో కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డు ప్రతిపాదనలు కోరింది. 

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..

ఈ మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ కేటాయిస్తే ఆక్యెపెన్సీ పెరుగుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు.

ఇకపై ఆ రూట్ ఏడున్నర గంటలే..