భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి అద్భుతమైన ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌

23 March 2024

TV9 Telugu

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

శాంసంగ్‌

శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లలో ఇది స్లిమ్మెస్ట్‌గా ఉంటుందని తెలుస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోంది. 

మరింత స్లిమ్‌గా..

ఆండ్రాయిడ్ 14 వెర్షన్ పై పని చేస్తుంది ఫోన్. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఆడ్రాయిడ్‌ 14 వెర్షన్‌

ఈ మొబైల్‌ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వరకూ ఉండే అవకాశం.ప్రస్తుతం ఈ వివరాలు లీక్‌ అయ్యాయి.

మొబైల్‌ కలర్స్‌

108-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 

108 మెగా పిక్సెల్‌

ఇందులో ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు.

కెమెరాలు

శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం15 ఫోన్ కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. 

మరో మొబైల్‌

మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ గల ఈ ఫోన్ వచ్చేనెలలో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ఎక్స్ నోస్ 1380 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 

చిప్‌ సెట్‌